ప్రతి దినం దీపం పెట్టకుంటే దినాము నష్టం అని నిపుణులు అంటున్నారు.. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు దూరమై పాజిటివిటీ వస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది ఇంట్లో ప్రతి రోజు పూజ చేస్తారు.. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం దీపం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
* దీపం వెలిగించే ముందు కుందులు శుభ్రంగా ఉండటం ముఖ్యం. శుభ్రం చేయకుండా పెడితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
* ఇంటిని శుభ్ర పరిచిన తర్వాత మాత్రమే ఇంట్లో దీపం పెట్టాలి.
* అంతే కాకుండా దీపం పెట్టే ముందు ఇంట్లో గంగాజలం జల్లితే ఇంకా మంచిది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.. పసుపు నీళ్లు జల్లితే ఎటువంటి క్రిమలు దరిచేరవు
* ఇంటి ముఖ ద్వారం వద్ద సాయంత్రం పూట కూడా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.
* దీపం కింద తమలపాకు పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అంటున్నారు పండితులు. దీని ద్వారా సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
* దీపాన్ని వెలిగించే ముందు కుందుల కింద చిన్న ప్లేట్‌ను అమర్చుకోవాలి. డైరెక్ట్‌గా నేల మీదా పెట్టి దీపం వెలిగిస్తే మంచిది కాదని పండితులు చెబుతున్నారు…
ఇవన్నీ గుర్తుంచుకొని దీపం పెట్టడం చాలా మంచిది.. అంతా మంచే జరుగుతుంది..