Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగులు

-

సింహాలు.. అవి బోనులో ఉంటేనే బయటి నుంచి చూడటానికి వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా జనాలపైకి అవి దూసుకొస్తే. గుండె ఆగినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి సంఘటనే చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ లుయోయాంగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. సర్కస్‌లో విన్యాసాలను వీక్షిస్తూ ఆనందిస్తున్న జనంపైకి ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకున్న రెండు సింహాలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారంతా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సర్కస్‌ ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్‌ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్‌ చేయని డోర్‌ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి.

దీంతో గ్యాలరీల్లో కూర్చొని వీక్షిస్తున్న జనం భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను త్వరగా పట్టుకొని తిరిగి బోనులో బంధించారు. ఈ ఘటనతో సర్కస్‌ను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news