నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే త్వరలో టీచర్లు, ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. బదిలీల్లో పారదర్శక విధానాన్ని తీసుకువస్తామన్నారు బొత్స. చాలా రోజుల తర్వాత టీచర్ ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పరిపాలన రాజధానిగా విశాఖపట్నమే మా పాలసీ అని మరోసారి స్పష్టం చేశారు బొత్స. డైవర్షన్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా..? అని ప్రశ్నించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని.. అది ఈరోజు బిడ్డింగ్ తో స్పష్టమైందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము ముందు నుంచే వ్యతిరేకమని తెలిపారు.