అలాంటి చిత్రాలకు గుడ్ బై చెప్పిన అల్లరి నరేష్..!

-

రవిబాబు దర్శకత్వంలో అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న వారసుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా పేరు నే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ అన్ని సినిమాలను కూడా కామెడీ జోనర్ లోనే తెరకెక్కించారు. అలా కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక సరైన హిట్టు లేకుండా తడబడ్డ ఈయనకు 2021లో నాంది సినిమా మంచి విజయాన్ని అందించింది.

ఇక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ పోషించి అందరిని ఆకట్టుకున్నాడు నరేష్. ముందు వరకు తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పుడు తన సీరియస్ లుక్ తో అందరిని భయపెట్టేస్తున్నారని చెప్పాలి. ఏడాదికి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన గత కొన్ని నీళ్లు సరైన సక్సెస్ లేక తన పంతాను మార్చుకున్నాడు అని అర్థమవుతుంది. ఇక నాంది సినిమా తర్వాత ప్రతి ఒక్క సినిమా కూడా అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు అల్లరి నరేష్.

ఈ క్రమంలోనే మరోసారి నాంది సినిమా దర్శకత్వం వహించిన విజయ్ కనక మేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ కాదా అందులో నరేష్ తన ఉగ్రరూపాన్ని చూపించాడని చెప్పాలి ఒక విధంగా ఈ సినిమాను చూస్తుంటే ఇకపై నరేష్ లోని అల్లరిని ఏమాత్రం చూడలేము అని మనకు స్పష్టం అవుతుంది. మొత్తానికైతే అల్లరి నరేష్ ఇకపై కామెడీ సినిమాలకు దూరం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ..కానీ దీనిపై స్పందించిన అల్లరి నరేష్ కామెడీ చిత్రాలు కూడా చేస్తాను కానీ కథ బాగుంటేనే అలాంటి చిత్రాలు చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news