ఆధార్ కార్డు వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. క్షణాల్లో రూ.2లక్షలు పొందే అవకాశం..

-

డబ్బుల అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అందుకే ఎక్కువగా లోన్ తీసుకుంటారు.. పర్సనల్ లోన్ తీసుకొనేవారికి ఎన్నో ప్రాసెస్ లు ఉంటాయి.. అదో పెద్ద తలనొప్పి అంటారు… పూర్తి వివరాలు, ఆస్తి విలువ, సంపాదన వివరాలు సహా అనేక డాక్యూమెంట్స్‌ని సమర్పించాల్సి ఉంటుంది..ముఖ్యంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం మధ్యవర్తులు చూసుకుంటున్నారు గానీ, ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. అయినా .. పర్సనల్ లోన్ పొందడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే, ఇప్పుడు ఈ దళారులు, ఏజెంట్స్‌తో పని లేకుండానే పర్సనల్ లోన్‌ను పొందే మార్గం ఒకటి ఉంది…ఇంట్లో కూర్చొనే రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

ఆధార్‌ కార్డుతో ఇంట్లో కూర్చునే రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ-కేవైసీ ద్వారా ఈ ప్రాసెస్ మరింత సులభమయ్యింది. ఆన్‌లైన్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడుచూద్దాం..ఆధార్ కార్డ్ సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి అనేక బ్యాంకుల కస్టమర్‌లు కేవలం ఆధార్ కార్డ్‌తో రుణాలను పొందవచ్చు. దీంతో పాటు, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే, మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఆధార్ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు రుణం పొందే వీలుంటుంది. మీ అప్లికేషన్ 5 నిమిషాల్లో ప్రాసెస్ అయ్యి మీరు అర్హులు అయితే లోన్ వస్తుంది..

ఈ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి..

. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

. బ్యాంక్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కూడా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

. యాప్ ఓపెన్ చేసిన తరువాత ఓటీపీ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

. ఆ తరువాత, పర్సనల్ లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

. లోన్ మొత్తం, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.

. ఆధార్ తో పాటు పాన్ డిటైల్స్ కూడా అప్లై చేసుకోవాలి..మీరు ఇచ్చిన సమాచారాన్ని బ్యాంక్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత, మీ లోన్ ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.. అలా మీరు అర్హులు అయితే మి అకౌంట్ లో డబ్బులు పడతాయి..

Read more RELATED
Recommended to you

Latest news