కన్నుల పండువగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరుగుతోంది. విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజనసంద్రంగా మారింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామి వారి తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం TTD తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తున్నారు.