BREAKING : అమృత్ పాల్ సింగ్‎ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు

-

BREAKING : గత కొద్ది రోజులుగా ఖలీస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. రకరకాల వేషధారణలో ఇప్పటికే పలుమార్లు పోలీసులకు మస్కా కొట్టి త్రుటిలో పరారవుతున్నాడు. అయితే, తాజాగా అమృత్ పాల్ సింగ్‎ను అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసులు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు అమృత్‌పాల్‌ సింగ్‌. మోగాలో అమృత్‌పాల్‌ పంజాబ్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం అందుతోంది. 35 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు అమృత్‌పాల్‌. రెండు రోజుల క్రితం అమృత్‌పాల్‌ భార్యను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే… అతని భార్యను అరెస్ట్‌ చేయడంతోనే, మోగాలో అమృత్‌పాల్‌ పంజాబ్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news