ఎల్ఐసి పథకాల లో డబ్బులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా మహిళలకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఆధార్ శిలా స్కీమ్.. ఈ స్కీమ్ లో మంచి బెనిఫ్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఒకసారి అవేంటో లుక్ వేద్దాం పదండీ..
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ ప్లాన్ లో బీమా రక్షణ, పొదుపు ప్రయోజనాలు రెండింటినీ పొందుతారు. మహిళలు రోజుకు రూ. 87 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ కాలానికి ఎక్కువ డబ్బును పొందవచ్చు. LIC ఆధార్ శిలా’ ప్లాన్ మహిళల కోసం రూపొందించబడిన ఎండోమెంట్, నాన్ లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఇది పాలసీ వ్యవధిలో మరణం సంభవించినప్పుడు కస్టమర్ల కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను పోగుచేయడంలో సహాయపడుతుంది. 8 నుంచి 55 ఏళ్ల లోపు మహిళలందరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు..
ఈ మెచ్యూరిటీ సమయం కనిష్టంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. గరిష్టంగా 70 సంవత్సరాలు. ఒక మహిళ ఈ పథకం లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గరిష్టంగా రూ. 3 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇక వాయిదాలను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన కూడా చెల్లించవచ్చు… మహిళలు 15 ఏళ్ల వయస్సు లో రోజుకు 87 రూపాయలు డిపాజిట్ చేస్తే.. ఏడాది కాలంలో రూ.31,755 మొత్తం పొదుపు అవుతుంది. అదేవిధంగా, 10 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేస్తే రూ. 3,17,550 అవుతుంది. ఆ తర్వాత, మెచ్యూరిటీ సమయంలో మొత్తం సుమారు రూ. 11 లక్షలు పొందుతారు.. చూసారుగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడే ఇన్వెస్ట్ చెయ్యండి..