చైతు, సమంత పోటీలో గెలిచింది ఎవరంటే..!

-

అక్కినేని ఫ్యామిలీ నుండి ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకరి సినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోగా.. మరో సినిమా యావరేజ్ రివ్యూస్ తెచ్చుకుంది. రెండిటిలో విజేత ఎవరన్నది తేలిపోయింది. ఇంతకీ ఎవరా ఇద్దరు ఏంటా విశేషాలంటే.. అక్కినేని ప్రేమ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తున్నారు.

ఇద్దరు తమ సినిమాలతో ఒకే రోజు పోటీ పడటం హాట్ టాపిక్ అయ్యింది. సమంత యూటర్న్ ముందే సెప్టెంబర్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. ఆగష్టు 31న రావాల్సిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడి వినాయక చవితి సందర్భంగా నిన్న వచ్చింది. రెండు సినిమాల్లో సమంత యూటర్న్ విజేతగా నిలిచిందని చెప్పొచ్చు.

మారుతి డైరక్షన్ లో చైతన్య హీరోగా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదటి భాగం అంతా మారుతి మార్క్ కనిపించినా సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు. ఇక సమంత యూటర్న్ మీద పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యూటర్న్ సోషల్ మెసేజ్ తో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

భార్యాభర్తలైన చైతు, సమంత బాక్సాఫీస్ ఫైట్ లో ఈసారి సమంత విజేతగా నిలిచింది. సమంత సినిమా ఎఫెక్ట్ శైలజా రెడ్డి మీద పడకున్నా సరే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం వల్ల ఎంతోకొంత నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news