టాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండ్ అంతా రీ రిలీజ్లదే. ఇప్పటికే అగ్ర హీరోల సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అయి అంతే స్థాయి హిట్ అందుకున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ కూడా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా రీరిలీజ్ చేస్తున్నారు.
అక్కడి మెల్బోర్న్ సిటీలోని ఐమాక్స్ థియేటర్లో మే 20వ తేదీన ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ ఐమాక్స్ ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్‌గా ప్రత్యేక గుర్తింపు కూడా పొందింది. తాజాగా సోమవారం ఈ థియేటర్లో ‘సింహాద్రి’ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలోనూ తారక్‌కు ఈ విధమైన రెస్పాన్స్ రావడం.. అది కూడా రీ రిలీజ్ అవుతున్న సినిమాకు ఈ రకంగా క్రేజ్ దక్కడం చూస్తుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తారక్‌కు ఎంత పాపులారిటీ ఉందో అర్థమవుతోంది.