స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి బంపర్ ఆఫర్.. రూ.10 వేల తగ్గింపు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా చక్కటి లాభాలని పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త ని చెప్పింది. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్ ని స్టేట్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్స్ వంటివి కొనుగోలు చేయాలని భావించే వారికి రిలీఫ్ కలుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వాడే వారు శాంసంగ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే రూ. 10 వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు అని ఎస్బీఐ అంటోంది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్, శాంసంగ్ ట్యాబ్స్‌పై రూ. 10 వేల వరనకు క్యాష్ బ్యాక్ ని కస్టమర్స్ పొందొచ్చు. కానీ ఎంపిక చేసిన ప్రొడక్టులకు మాత్రమే ఈ ఆఫర్. జూన్ 30 వరకు ఈ ఆఫర్లు పొందొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. నెలలో ఒక కార్డుపై ఒక సారి మాత్రమే ఆఫర్ ని పొందుటకు అవుతుంది.

ఈఎంఐ టెన్యూర్ కనీసం 6 నెలలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతుంది. మూడు నెలల టెన్యూర్ ఎంచుకుంటే 5 శాతం వడ్డీ రేటు పడుతుంది. 6, 9, 12 నెలల టెన్యూర్‌తో ఈఎంఐ పెట్టుకుంటే వడ్డీ రేటు 15 శాతంగా ఉంటుంది. 18 నెలలు, 24 నెలల టెన్యూర్ అయితే వడ్డీ రేటు 16 శాతంగా ఉంటుంది. ఈఎంఐ టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారిపోతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ట్రాన్సాక్షన్లు పూర్తి చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మీకు వచ్చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news