vastu: వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని తప్పులను చేయకూడదు. అలానే వాస్తు ప్రకారం ఉద్యోగంలో పైకి రావాలని వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకొని ఆచరించండి. చాలా మంది ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. వ్యాపారాలను చేస్తూ ఉంటారు అయినా సరే సరిగ్గా లాభాలు రావు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
కెరీర్ లో ఇలా మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లైతే వాస్తు చిట్కాలని తప్పక ట్రై చేయండి. వాస్తు ప్రకారం మీరు కనుక ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే డబ్బులు రావడం కోసం ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో చెక్కలని వేయండి దీనిని మీరు డబ్బులు దాచుకునే చోటనే పెట్టండి. ఇలా చేయడం వలన డబ్బులు వస్తాయి. ఆనందం కలుగుతుంది ధనవంతులు అవుతారు.
బిజినెస్ లో కానీ ఉద్యోగంలో కానీ మీరు సక్సెస్ ని పొందాలనుకుంటే రాగి మొక్కని పూజిస్తే మంచిది. శనివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక రూపాయి కాసు ఒక చెక్క తీసుకువెళ్లి పెట్టండి. తర్వాత రోజు ఆకుని తెచ్చుకుని చక్కని ఆ రూపాయి కాయిన్ ని దానికి కట్టండి. వీటిని మీరు డబ్బులు దాచుకునే చోటునపెట్టండి ఇది కూడా మీకు సక్సెస్ ని అందుకోవడానికి సహాయపడతాయి.
ఒకవేళ ఆటంకాలు ఇబ్బందులతో మీరు సతమతమవుతుంటే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నోట్లో ఒక లవంగాన్ని ఉంచుకోండి. అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి పోవాలంటే ఒక వెండి బౌల్లో ఒక చెక్క వేసి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టండి. సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడేటట్టు పెట్టాలి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.