సూర్యాపేట: అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను యుద్ధప్రాతిపాదికన సేకరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జగదీశ్ రెడ్డి. పంట నష్టం, కొనుగోళ్లపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ళను ఆలస్యం చేయవద్దని అధికారులకు సూచించానని తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు జగదీశ్ రెడ్డి.
తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్యా ధాన్యం కొనుగోలు చేయడంలో కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను కొంటామని భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ఇక రాబోయే ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని వేషాలు వేసినా రైతులు కేసీఆర్ గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు.