కళ్లుచెదిరే బంపర్ ఆఫర్: ముఖేష్ అంబానీ ఉద్యోగికి రూ. 1500 కోట్ల బహుమతి !

-

ఒక కంపెనీలో లేదా ఏదైనా షాపులో ఉద్యోగం చేస్తున్న ఏ చిన్న ఉద్యోగి కూడా ఎంతో నిజాయితీగా పనిచేస్తేనే తగినఫలితం దక్కుతుంది. కొన్ని సంస్థలు ఎంత నిజాయితీగా పనిచేసినా పెద్దగా గుర్తించకపోగా ఇంకా ఎక్కువ ఒత్తిడి ఇస్తూ ఉంటారు. కానీ తాజాగా తెలుస్తున్న ఒక విషయం మాత్రం ఎందరో ఉద్యోగులకు మరియు ఎన్నో కంపెనీలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పాలి. ప్రపంచంలోనే అపార కుభేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కంపెనీ లో పనిచేసే ఒక ఉద్యోగికి అతను ఊహించని బహుమతిని ఇచ్చి షాక్ అయ్యేలా చేశాడు. 1980 లో రిలయన్స్ లో ఒక ఉద్యోగోయిగా మనోజ్ మోడీ జాయిన్ అయ్యారు.

అప్పటి నుండి ఎన్నో విజయాలను ముఖేష్ అంబానీకి అందించారు. ఇతను ముఖేష్ అంబానీకి చిన్ననాటి స్నేహితుడు కావడం మరో విశేషం. ప్రస్తుతం ఈయన రిలయన్స్ రీటైల్ మరియు జియో లకు డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతనికి అంబానీ రూ. 1500 కోట్ల విలువ చేసే అంతస్థుల భవనాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news