భయపెట్టి ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్నారు – నాదెండ్ల మనోహర్

-

కాకినాడ: మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, వారికీ భృతి 30 వేలు ఇవ్వాలని నేడు జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యకార జేడీ కి వినతి పత్రం అందజేశారు జనసేన పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

ఇంటింటికి వెళ్లి భయపెట్టి స్టికర్లు వేస్తున్నారని ఆరోపించారు నాదెండ్ల మనోహర్. మత్స్యకారులును ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. మత్స్యకారులు వేరే రాష్ట్రాలకి వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న వారిని జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news