తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలతో ప్రజల వద్దకు వెళుతుండగా.. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని 47 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న ఆయన నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు లేఖ రాశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది నియోజకవర్గాలు, హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి లోని 8, మహబూబ్ నగర్ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ కోరారు. మరి కాంగ్రెస్ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.