ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. 16 మంది మృతి!

-

ఉక్రెయిన్‌పై రాజధాని కీవ్‌సహా ఆయా నగరాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. దాదాపు 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించింది. ఆయా దాడుల్లో మొత్తం 16 మంది మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మార్చి 9వ తేదీ తర్వాత కీవ్‌పై మాస్కో బలగాలు క్షిపణి దాడులు  చేపట్టడం ఇదే మొదటిసారి.

మరోవైపు.. కీవ్‌ గగనతలంలో ఉక్రెయిన్‌ వాయుసేన మొత్తం 11 క్షిపణులు, రెండు యూఏవీలను నేలకూల్చినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది. రష్యా సైనిక చర్య విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ మాట్లాడటం, ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున యుద్ధ సామగ్రి అందించినట్లు నాటో  వెల్లడించిన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.

రష్యా తాజా దాడుల్లో ఉమాన్‌ నగరంలోని ఓ తొమ్మిది అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పదేళ్ల చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 17 మంది గాయపడ్డారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news