హాహాహా హాసిని గుర్తుంది కదా. అదేనండి జెనీలియా. అప్పుడెప్పుడో టాలీవుడ్లో ఓ రేంజ్లో సత్తా చాటిన ఈ బ్యూటీ చాలా ఏళ్లుగా వెండితెరకు దూరమైపోయింది. ఇటీవలే మరాఠీలో తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి వేడ్ అనే సినిమాలో నటించింది. మజిలీ సినిమాకు ఇది రీమేజ్. రియల్ లైఫ్ కపుల్ రీల్లోనూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
జెనీలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ భామ తరచూ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చేసిన సందడంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ పోస్టులు చూస్తుంటే జెనీలియా ఎంత హ్యాపీ పర్సనో ఇట్టే అర్థమైపోతుంది. ఇక అప్పుడప్పుడు జెనీలియా ఫొటోషూట్స్ చేసి ఆ ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో కనిపించింది.
బ్రౌన్ కలర్ శారీలో జెనీలియా చాలా అందంగా కనిపిస్తోంది. మరాఠీ కట్టుబొట్టులో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేసింది. ముసిముసి నవ్వులు నవ్వుతూ తన ఛార్మింగ్ స్మైల్‌తో అభిమానులను కట్టిపడేసింది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాహాహా హాసినీయే కదా.. ఎన్నాళ్లయింది చూసి అంటూ కామెంట్లు చేస్తున్నారు. హాసినీ టాలీవుడ్‌కు మళ్లీ ఎప్పుడొస్తావ్ అంటూ క్వశ్చన్లు కురిపిస్తున్నారు.