Parenting tips: చిన్నారుల ముందు తల్లిదండ్రులు ఈ తప్పులని అస్సలు చెయ్యకూడదు..!

-

పిల్లలు ప్రతి విషయాన్ని పెద్దలు నుండే గ్రహించి నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకని పిల్లల్ని ఎంతో మంచిగా చక్కగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రుల నుండి ఎక్కువగా పిల్లలు అన్ని విషయాలని నేర్చుకుంటారు. అటువంటప్పుడు తల్లిదండ్రులు కచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అసలు తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ తప్పులు చేయకూడదు. వీటివలన పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది.

పిల్లలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి వివిధ సమస్యల గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. నిత్యం పిల్లలు ఉండే చోట వాదనలు జరుగుతూ ఉంటే వారి యొక్క మానసిక స్థితి పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వాతావరణంలో పిల్లల్ని ఉంచాలి. పిల్లలు ముందు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. తల్లిదండ్రులు గొడవపడితే వాళ్ళకి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది అలానే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై కోపాన్ని చూపిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మీద చికాకు ఉంటే దానిని పిల్లలపై వేసి రుద్దకూడదు. అలానే చిన్న విషయాలకే పెద్దగా శబ్దాలు చేయడం మంచి అలవాటు కాదు.

ఎక్కువ అరవడం వలన పిల్లల్లో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది అలానే మీరు ఇంట్లో పెద్దలని వ్యతిరేకించేటప్పుడు చిన్నారులు అక్కడ లేకుండా చూసుకోండి. పెద్ద వాళ్ళని వ్యతిరేకించడంతో పిల్లల మనసు కలత చెందుతుంది. అంతే కాదు పిల్లల్ని ఎప్పుడూ కూడా కంపేర్ చేసి చెప్పకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు నువ్వు ఇలా ఉన్నావు అని అస్సలు వాళ్ళని అనకూడదు. పిల్లల్ని కంపేర్ చేయడం వలన వాళ్ళు మొండిగా మారతారు. పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి కూడా పెట్టకూడదు. చదువు విషయంలో కానీ మరే విషయంలో కానీ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ పెట్టొద్దు అలానే పిల్లలకు పని చెప్పి లంచం ఇవ్వడం వంటివి చేయకూడదు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news