వారే నా జీవితాన్ని నాశనం చేశారు – భూమిక..!

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో నటించి తనకంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన భూమిక ఒక్కడు, ఖుషి వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాలో అమాయకత్వంతో ఎంతోమందిని మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా అవకాశాలు అందుకుని అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా చలామణి అయింది.

ఇక క్రమంగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో అవకాశాలు రావడంతో అక్కడకు మకాం మార్చిన భూమిక అక్కడే తన కెరియర్ ను ఎదగకుండా కొంతమంది అడ్డుకున్నారు అంటూ తెలిపింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది.. భూమిక మాట్లాడుతూ హిందీలో రెండు సినిమాలలో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారు . దానివల్ల ఇప్పుడు నా కెరియర్ ఇలా ఉంది ఒకవేళ ఆ రెండు సినిమాలు చేసి ఉండి ఉంటే కచ్చితంగా నా కెరియర్ పీక్స్ లో ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.

హిందీ లో తేరే నామ్ తర్వాత ఓ పెద్ద సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా నుంచి తప్పించారు. ఆ తర్వాత జబ్ వి మెట్ లో కూడా ఛాన్స్ వచ్చింది. అయినా ఆ అవకాశాన్ని కూడా కావాలనే కొంతమంది వేరే హీరోయిన్ కి ఇచ్చారు.. అలా ఆ రెండు సినిమాలు కొంతమంది వ్యక్తుల వల్ల నేను అవకాశం కోల్పోయాను.. లేకపోతే ఈరోజు నా కెరియర్ మరోలా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news