పవన్‌ – చంద్రబాబు భేటీపై నాదెండ్ల మనోహర్ హాట్‌ కామెంట్స్‌

-

పవన్‌ – చంద్రబాబు భేటీపై నాదెండ్ల మనోహర్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా విధానం., నినాదం అన్నారు. నిన్న చంద్రబాబుతో చర్చల్లో అదేకీలక అంశం అని.. భవిష్యత్ లో మరికొన్ని చర్చలు జరుగుతాయని వెల్లడించారు. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోంది….సీట్లపై ప్రచారాలు ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు.

ముఖ్యమంత్రి పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది….దానిని భరించలేక దాడులకు పాల్పడతున్నారని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో లా&ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని విమర్శలు చేశారు. తాను ఎక్కడ కాపురం పెడితే అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా CM వ్యాఖ్యలు చెయ్యడం విచిత్రంగా ఉందని వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అమలు చేస్తామని ప్రకటన చేశారు నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news