టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. కేవలం స్టే ల మీద బతుకుతున్న చంద్రబాబుకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర బయటపడనిందని.. ఆయన బొక్కలోకి వెళ్లడం ఖాయమని అన్నారు.
సిట్ నియామకం పై హైకోర్టు ఇచ్చిన స్టే ని సుప్రీంకోర్టు కొట్టి వేయడం పై హర్షం వ్యక్తం చేశారు. సిట్ విచారణతో చంద్రబాబు బంధువులకు, అనుచరులకు రాజధాని విషయంలో దోచిపెట్టినవన్నీ బయటకి వస్తాయని అన్నారు. సుప్రీం తీర్పుతో చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర మారిపోతుందన్నారు జోగి రమేష్.