ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ తన జోరును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా ప్రమేయం ఉన్న వారిని అందరినీ విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్టులు చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ నే పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వలన గందరగోళంగా మారింది. మాములుగా ఈ స్కాం లో ప్రమేయం ఉందన్న కారణంగా ఢిల్లీ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పేరును కేసులో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ సింగ్ వారికీ తన ప్రతిష్టను దెబ్బ తీశారు అన్న కారణం చేత లీగల్ నోటీసులు పంపించారు. కానీ అది క్లరికల్ మిస్టేక్ వలన జరిగిందని ఆయనకు ఈ కేసుకు సంబంధం లేదని.. రాహుల్ సింగ్ కు బదులుగా మా స్టాఫ్ సంజయ్ సింగ్ అని టైపు చేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఈడీ అధికారిక లేఖను రాసింది.
పైగా సంజయ్ సింగ్ కు ఈడీ క్షమాపణలు కూడా చెప్పడం కొసమెరుపు. దీనితో బాధ్యత కల్గిన స్థానంలో ఉండి కూడా ఇలాంటి పొరపాట్లు చేయడం ఏమిటని ఈడీ ని అంతా విమర్శిస్తున్నారు.