గత కొద్ది రోజులుగా సీనియర్ హీరో మరియు సహనటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్సను తీసుకుంటున్నారు. ఈయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లు తమ కుటుంబ సభ్యులకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అడ్డమైన సోషల్ మీడియా వలన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈయన సజీవంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కొందరు శరత్ బాబు చనిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శరత్ బాబు సోదరి ఎంతో బాధతో స్పందించారు.
ఆమె మాట్లాడుతూ మా బ్రదర్ శరత్ బాబు మీరు అనుకుంటున్నట్లు మరణించలేదు.. ఇంకా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అతి త్వరలోనే పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తారని పేర్కొన్నారు. శరత్ బాబు చనిపోయాడని కుష్బూ సైతం సోషల్ మీడియాలో చెప్పడం తెలిసిందే.