జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డికు ఊహించని షాక్ తగిలింది.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ముత్తిరెడ్డిపై సొంత కూతురు తుల్జా భవాని రెడ్డి కంప్లైంట్ చేశారు.
అయితే… సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణలు చేశారు. ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో ఈ భూమిపై తీవ్ర వివాదం చెలరేగింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆయన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో ఆ సంచలన భూ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.