HBD Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలియని విషయాలివే..!

-

ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డ్యాన్సింగ్ క్వీన్ గా మంచి పేరు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈరోజు ఆమె పుట్టిన రోజు.. మరి ఈ సందర్భంగా ఆమె గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంతామరై.. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలో సెంతమరై కన్నన్, రాధా దంపతులకు జన్మించింది. ఇక సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం.. ఆమె ఈ డాన్స్ నేర్చుకోవడానికి ఏ కోచింగ్ క్లాస్ కు వెళ్లలేదు. కేవలం తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ అందుకు అనుగుణంగా కాళ్లు కలుపుతూ తనదైన స్టైల్ లో చెప్పులేసేది. ఇక డాన్స్ మీద ఉన్న మక్కువతో 2009లో ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచింది. ఆ తర్వాత 2008లో జయం రవి హీరోగా తెరకెక్కిన ధామ్ ధూమ్ సినిమాలో కూడా నటించింది.

ఇక 2014లో మలయాళ చిత్రం ప్రేమలో కూడా హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇక ఫిదా సినిమా తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు , మారి 2 వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. శేఖర్ కమ్ముల ,నాగచైతన్య కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంలో కూడా నటించింది. అలాగే నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో దేవదాసి పాత్రలో కనిపించి మెప్పించిన ఈమె విరాటపర్వం, గార్గి సినిమాలలో కూడా నటించి అలరించింది. ఇదిలా ఉండగా ఫెయిర్నెస్ క్రీమ్ ప్రచారం చేయడానికి రూ.2 కోట్ల ఆఫర్ వచ్చినా అసత్య ప్రచారాలు చేయడం ఇష్టం లేక ఆఫర్ రిజెక్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news