ఉత్కంఠ క్షణాలు: 12 గ్యాస్ సిలిండర్ లతో ఆటో… “గ్యాస్ లీక్” తప్పిన పెద్ద ప్రమాదం !

-

ఈ రోజు కాసేపటి క్రితమే హైద్రాబాద్ లోని పాతబస్తీలో చాంద్రాయణగుట్ట హైవే బోయినపల్లి నుండి గగన్ పహాడ్ లో గ్యాస్ సిలిండర్ లతో వెళుతున్న ఆటో నుండి సడెన్ గా ఒక గ్యాస్ నుండి లీక్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కొంతసేపు గజగజ వణికారు. ఇది గమనించిన అటు వైపు వెళ్తున్న వాహనదారులు సైతం వాహనాలు అక్కడే వదిలేసి పరుగులు తీశారు. ఆటో లో ఉన్న డ్రైవర్ కూడా గ్యాస్ లీక్ అవ్వడంతో ఆటతో నుండి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన ఫలక్ నామా పోలీసులు హై వే వద్దకు చేరుకొని పరిస్థితిని తన అదుపులోకి తీసుకున్నారు. అక్కడి ఉన్న వారిని దూరంగా పంపించారు, ఆ తర్వాత ముందే ప్రమాదం జరుగుతుందేమో అని గ్రహించిన పోలీసులు అగ్నిమపాక సిబ్బందిని పిలిపించారు. ఆ తర్వాత ఆటో లో ఉన్న సిలిండర్ లను కిందికి దింపారు.

అయితే ఆభగవంతుని దయవలన ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఆ సమయంలోకి ఆటో లో సీలిండర్ లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ పరిణామంలో హై వే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ఆపరేషన్ లో సక్సెస్ అయినా పోలీసులను స్థానికులు ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news