రేపటి నుండి తెలంగాణ “ఎంసెట్” పరీక్ష.. సర్వం సిద్ధం !

-

తెలంగాణాలో రేపటి నుండి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి మంది 320587 విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రము నుండి 248392 మంది విద్యార్థులు పరీక్షకు రాయనుండగా, 72195 మంది ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి పరీక్ష రాయనున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఎంసెట్ పరీక్షల్లో రేపు మరియు ఎల్లుండి అగ్రికల్చర్ మరియు ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. కాగా మే 12 ,13 మరియు 14 తేదీలలో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా 137 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు అనుమతించు సమయాన్ని అధికారులు మొదటి పరీక్షను ఉదయం 7 .30 గంటలుగా నిర్ణయించారు.

ఒక్కసారి పరీక్ష స్టార్ట్ అయితే ఎటువంటి పరిస్థితిలో లోనికి అనుమతించరని చెబుతున్నారు. ఇక పరీక్ష ముగిసే ఆఖరి నిముషం వరకు కూడా హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక పరీక్షను రాయడానికి బాల పాయింట్ పెన్ ను మాత్రమే తెచ్చుకోవలెను.

Read more RELATED
Recommended to you

Latest news