గత వారం నుండి మణిపూర్ రాష్ట్రంలో ఒక బిల్లు వలన ఎంత హింస మరియు అల్లర్లు చెలరేగాయి తెలిసిందే. ఈ హింసలో నరకం అనుభవించిన చాలా మందికి ప్రాణభయం వచ్చి ఉంటుంది. కాగా గత రెండు మూడు రోజులుహా అల్లర్లు చల్లబడినట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ హై వే లలో కొంతవరకు అలజడులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మాములుగా వచ్చేంత వరకు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీయూస్కున్తున్నాము అని తెలిపింది. ఇందుకోసం అవసరమైనంత వరకు మణిపూర్ మేధావులను అందరితో కలిసి మాట్లాడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి డ్రోన్లు మరియు హెలికాఫ్టర్ లతో మానిటర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హింసలో పార్ట్ అయిన కొందరిని పట్టుకుని వారిపై ఎఫ్ ఐ ఆర్ కేసులను నమొదుచేసినట్లు చెప్పారు.
ఇప్పటికే క్యాంపు నుండి 24 వేల మంది వరకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆయుధాలను ఇచ్చేయమని కోరుతున్నాము.. ఇప్పుడు ఆయుధాలను తిరిగి ఇచ్చేస్తే చర్యలు వారిపై ఉండవని కూడా తెలిపింది మణిపూర్ సర్కారు.