రాత్రి నిద్రపోయే ముందు ఎట్టిపరిస్థితుల్లో ఈ 8 తినద్దు.. తింటే అంతే సంగతులు..!

-

ఆహారం: మనం తీసుకునే ఆహారంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది చాలామంది సమయం చూసుకోకుండా నచ్చిన వాటిని తీసుకుంటూ ఉంటారు.దాని వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే రాత్రిపూట మాత్రం అస్సలు వీటిని తీసుకోవద్దు. రాత్రి నిద్రపోయే ముందు కనుక మీరు వీటిని తీసుకున్నారు అంటే ఇక అంతే సంగతులు.

రాత్రి నిద్ర పోయే ముందు ఆల్కహాల్ ని అసలు తీసుకోకూడదు. ఆల్కహాల్ ని కనుక రాత్రి నిద్ర పోయే ముందు తీసుకుంటే మీ యొక్క స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది రాత్రి నిద్ర పోయేటప్పుడు ఆల్కహాల్ ని తీసుకుంటే గురక ఎక్కువవుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి.
బాగా హెవీ గా ఉండే ఆహార పదార్థాలని కూడా రాత్రిపూట తీసుకోకూడదు బాగా హెవీగా ఉండే ఆహార పదార్థాలని రాత్రి తీసుకుంటే కడుపు బరువుగా ఉంటుంది. జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొవ్వు ఉండే వాటిని చీజ్ ఉండే వాటిని ఫ్రై చేసిన వాటిని తీసుకోవద్దు. వీటి వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి.

నీటి శాతం ఎక్కువ ఉండే వాటిని తీసుకోవద్దు నీటి శాతం ఎక్కువ ఉండే వాటిని తీసుకుంటే పదే పదే రాత్రి నిద్ర లేవాల్సి ఉంటుంది. పుచ్చకాయలు కీరదోస వంటి నీళ్లు ఎక్కువ ఉండే వాటిని తీసుకోకండి.
కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. చాక్లెట్లు, టీ, సోడా, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా… వాటిలో అటువంటి వాటిని కూడా రాత్రిపూట తీసుకోవద్దు దీనివల్ల నిద్ర పాడవుతుంది.
బాగా షుగర్ ఎక్కువ ఉండే వాటిని రాత్రి పూట తీసుకోవద్దు. ఒకవేళ కనుక రాత్రిపూట అటువంటి వాటిని తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

బాగా కారంగా ఉండే వాటిని కూడా రాత్రిపూట తీసుకోకూడదు స్పైసి ఫుడ్ ని చాలా మంది రాత్రిపూట ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఆ తప్పు చేశారంటే మీ బాడీ టెంపరేచర్ పై అది ప్రభావం చూపిస్తుంది పైగా ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది కడుపులో మంట వంటివి కూడా కలుగుతాయి.
ఎసిడి ఫుడ్స్ ని రాత్రిపూట తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇబ్బందులు వస్తాయి. సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయలు, వైట్ వైన్, టమాటా సాస్ వంటివి రాత్రిపూట తీసుకోకూడదు గుండెలో మంట వంటివి కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news