తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్రము నుండి గతంలో కన్నా అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా కొన్ని చోట్ల అస్సలు ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వని స్కూల్స్ మొత్తం 25 ఉన్నాయి. అయితే తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పాలి. సిద్ధిపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో టెన్త్ క్లాస్ లో 10 కి 10 GPA సాధించిన విద్యార్థులు అందరికీ రూ. 10000 చొప్పున నగదు బహుమతి అందించడానికి పూనుకున్నారు.
ఇక శాతం ఉత్తీర్ణతను సాధించిన స్కూల్స్ కు రూ. 25000 నగదు బహుమతిని అందిస్తున్నారు. కాగా ఈ పురస్కారాలు అన్నీ కూడా వచ్చే నెల మొదటి వారంలో అందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజముగా సంతోషించదగ్గ విషయం అని చెప్పాలి.