సాధారణంగా ఫేవరెట్ హీరోలపై అభిమానులకు ప్రేమ ఉంటుంది. నా హీరో గొప్పంటే.. నా హీరో గొప్పని చాలా మంది అంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఫాన్స్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లి శుభలేఖల మీద సహజంగా దేవుడి ఫొటోలు వేస్తారు. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకతను పవన్ నా దేవుడంటూ తన పెళ్లి శుభలేఖలపై జనసేనాని ఫోటోలను అచ్చు వేయించాడు.
శుభలేఖ బ్యాక్ గ్రౌండ్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ చిత్రాన్ని ముద్రించాడు. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని పవన్ పై తనకున్నా అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. అక్టోబర్ 13న న రాజేష్ రెడ్డికి హేమలతతో వివాహం నిశ్చమైంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.