ఎంపీ మార్గాని భరత్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు – నారా లోకేష్

-

 

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నిలదీశారు నారా లోకేష్. పుట్టిన‌రోజు నాడే ఒక వెట‌న‌రీ డాక్ట‌ర్‌ని కారుతో గుద్ది చంపేసి ప‌రారైన‌ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసులూ? వైకాపాలో అంద‌రూ హంత‌కులేనా? వైకాపా అధినేత బాబాయ్‌ని వేసేసి మాపై తోసేశారు. వైకాపా ఎమ్మెల్సీ అనంత‌బాబు త‌న డ్రైవ‌ర్‌ని చంపేసి డెడ్ బాడీని డోర్ డెలివ‌రీ చేశారు. వైకాపా ఎంపీ రీల్ స్టార్ భ‌ర‌త్ గారు వెట‌న‌రీ డాక్ట‌ర్ ని చంపేసి ప‌రార‌య్యారు. మీరు మ‌నుషులేనా? మాన‌వ‌త్వం ఉందా? జ‌నాల్ని చంప‌డానికే మీకు అధికారం ఇచ్చారా? అని ప్రశ్నించారు.

 

జగన్మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే!!అబద్దాలు, మోసం, నయవంచన కలగలిసిన మానవరూపాన్ని జగన్మోహన్ రెడ్డి అంటారు. శ్రీశైలం నియోజకవర్గం కరివేను గ్రామంలో అగ్రిగోల్డ్ కు చెందిన ఫామ్ ల్యాండ్ ఇది. ఆగ్రిగోల్డ్ ఆస్తులను మేం బినామీ పేర్లతో కొట్టేశామని అబద్దపు ప్రచారంతో మాపై విషం చిమ్మిన జగన్…అధికారంలోకి వచ్చిన ఆరునెలల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి నాలుగేళ్లు దాటిపోయింది. ఆరునెలల్లో న్యాయం చేయడమంటే వారంరోజుల్లో సిపిఎస్ రద్దుచేసిన మాదిరిగానేనా జగన్మోసపురెడ్డీ?! అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news