ఏపీ జర్నలిస్టులకు అదిరిపోయే శుభవార్త

-

ఏపీ జర్నలిస్టులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.  జర్నలిస్టులకు హెల్త్ క్యాంపు ప్రారంభించనున్నారు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజని. లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జర్నలిస్టులకు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ ఏర్పాటు చేయనున్నారు.అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు పూర్తి స్ధాయి వైద్య పరీక్షలకు ఏర్పాటు చేయనున్నారు.

కాగా,ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌డం ప్ర‌భుత్వాల క‌ర్త‌వ్య‌మ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం మురికిపూడిలో రూ.60లక్ష‌ల వ్య‌యంతో మంచినీటి పైపు లైను నిర్మాణం, ప్ర‌తి ఇంటికీ కుళాయి ఏర్పాటు ప‌నుల‌కు శంకుస్థాప‌న నిర్వ‌హించారు. మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారికి బాగా తెలుస‌ని పేర్కొన్నారు. అందుకే దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. మంచినీటి స‌మ‌స్య‌ను తీర్చేందుకు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. జేజే ఎం కింద నియోజ‌వ‌క‌ర్గంలో మంచినీటి స‌మ‌స్య లేకుండా ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news