భారత్ లో విధ్వంసం. సృష్టించడానికి ఉగ్రవాదులు మరోసారి విఫలయత్నం చేశారు. ఈ విధ్వంసానికి హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకోవాలని భావించారు. కానీ నగర పోలీసులు వారి కుట్రను ముందుగానే చేదించారు. నగరంలో మారణహోమం సృష్టించాలి అంకున్న ఇస్లామిక్ రాడికల్స్ ను పట్టుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాంlద్రాయణగుట్టలో ఏటీఎస్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం రోజున బాబానగర్‌లో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరొకరిని అదుపులోకి తీసుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాల కేసులో అరెస్టుల సంఖ్య 16కి చేరింది.
విధ్వంసానికి పథక రచన చేసిన హిజ్బ్ ఉత్ తహరీర్ కేసులో భాగ్యనగరంలో ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురిని మధ్యప్రదేశ్లోని భోపాల్ ఏటీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ముందే అరెస్టు అయిన ఐదుగురు నిందితులు చేసిన ఉగ్ర కుట్ర వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఆ వ్యక్తికి అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఏటీఎస్ పోలీసులు టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సాయంతో విచారణ చేపడుతున్నారు.