పెళ్లికి సిద్ధమైన తరుణ్.. వధువు ఎవరంటే..?

-

ప్రముఖ యంగ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి.. పదికి పైగా చిత్రాలలో నటించి ఆ తర్వాత నువ్వే కావాలి చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలతో లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిజినెస్ లో బిజీ కావడం చేత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తరుణ్ వయసు మీద పడుతున్నా.. పెళ్లి అనే మాటలకు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని పెళ్లి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై తరుణ్ తల్లి, నటి రోజా రమణి అందించారు.. ఇకపోతే తరుణ్ పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతోందని ఆమె చెప్పుకు వచ్చారు. ఇకపోతే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. తరుణ్ రీయంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తో పాటు సినిమా కూడా చేస్తున్నాడు అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేము. అందరి ఆశీస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్ళీ హీరోగా రాణిస్తాడని భావిస్తున్నాను అంటూ చెప్పింది.

ఇక తరుణ్ గురించి చెబుతూ.. తరుణ్ ప్రతిరోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడు.. భక్తి ఎక్కువ. ప్రస్తుతం అభిమానుల ఆశీస్సులతో హ్యాపీగా ఉన్నాడు. తరుణ్ పెళ్లి ఒకటి అయితే చాలు అంతకుమించి సంతోషం మా జీవితంలో మరొకటి లేదు అది ఎలాగో అవుతుంది.. కానీ సమయం పడుతుంది.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news