ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్ BRS పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ లో కీలకంగా చర్చించిన విషయం ఒక్కటే మరికొంతకాలంలో రానున్న ఎన్నికలలో BRS ఏ విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇందుకోసం ఏ ప్రణాళికలను అమలు చేయాలి వీటిపైనే చర్చ సాగినట్లు సమాచారం. కాగా ఈ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ర్బోయేది మనమే అని చాలా నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ఈయన ఈ పది సంవత్సరాలలో మన ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేసింది అన్నది వారికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అని దిశ నిర్దేశం చేశారు.
దీనితో కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఒక టార్గెట్ ను సెట్ చేశాడు అన్నది క్లియర్ గా అర్ధమవుతోంది.