చాలామంది స్మోకింగ్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. మీరు కూడా స్మోకింగ్ కి అలవాటు పడిపోయారా… స్మోకింగ్ అలవాటు నుండి బయట పడలేకపోతున్నారా… స్మోకింగ్ మానేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి అప్పుడు కచ్చితంగా స్మోకింగ్ నుండి బయట పడిపోవచ్చు. స్మోకింగ్ నుండి బయటపడడానికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. నికోటిన్ పాచులు, నాజల్ స్ప్రే. ఇన్హేలర్, నికోటిన్ గమ్స్ ఇలా చాలా ఉన్నాయి అయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు సెట్ అయ్యే పద్ధతిని ఎంచుకోండి. దాంతో స్మోకింగ్ అలవాటు నుండి బయటపడవచ్చు.
ఈ పద్ధతి కూడా బాగా ఉపయోగపడుతుంది. స్మోక్ చేయాలని అనిపించినప్పుడల్లా పది నిమిషాలు ఆగి ఆ తర్వాత స్మోక్ చేయాలని నిర్ణయించుకోండి. ఇలా పది నిమిషాల పాటు పోస్ట్
పోన్ చేస్తూ ఉండండి దీంతో ఎంతో కొంత స్మోకింగ్ అలవాటని కంట్రోల్ చేయొచ్చు. బబుల్ గమ్ క్యాండీ ఇలా ఇష్టమైన వాటిని తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ నట్స్ కూరలు వంటివి తీసుకుంటే కూడా సిగరెట్ తాగాలన్న కోరిక తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన స్మోకింగ్ అలవాటు నుండి బయటపడవచ్చు.
వ్యాయామంతో కూడా స్మోకింగ్ అలవాటు నుండి బయటపడొచ్చు. అలానే ఎక్కువగా చాలామంది స్మోకింగ్ చేసే ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది అయితే ఆ ప్లేస్ కి దూరంగా ఉంటే కూడా స్మోకింగ్ అలవాటు నుండి బయట పడొచ్చు. స్మోకింగ్ మానేసి మీ ధ్యాసని మరో చోట పెట్టండి. కూరలు, పండ్లు తీసుకుంటూ ఉంటే కూడా ఈ సమస్య నుండి బయటపడచ్చు. పంచదార కెఫిన్ కి దూరంగా ఉండండి అలానే ఒత్తిడి వలన స్మోకింగ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా కూడా చేసుకోండి. బాగా నిద్రపోతే కూడా స్మోకింగ్ అలవాటు నుండి బయటపడొచ్చు. ఇలా వీటిని ఫాలో అయితే స్మోకింగ్ కి దూరంగా ఉండొచ్చు.