‘దిల్లీ అధికారాలు ప్రభుత్వానికే’.. సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్

-

దిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ కాంట్రవర్సీ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇటీవలే దిల్లీలో పరిపాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది.

మే 11న సుప్రీంకోర్టు దిల్లీ పాలనపై సంచలన తీర్పు చెప్పింది. దిల్లీ పాలనా అధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా అన్ని వ్యవహారాలపై సర్కారుకే నియంత్రణ ఉంటుందని తేల్చి చెప్పింది.

దిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాల కోసం కేంద్రం శుక్రవారమే ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసేలా ఆర్డినెన్స్ రూపొందించింది. అయితే, ఇది లెఫ్టినెంట్ గవర్నర్​కు అధికారాలు కట్టబెట్టేలా ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడుతున్నారు. కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news