చిన్ననాటి ఇల్లును అమ్మేసిన గూగుల్ సీఈవో.. తండ్రి ఎమోషనల్

-

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తమిళనాడులో తాను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. తమిళ సినీ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. చెన్నైలోని అశోక్‌ నగర్‌లో సుందర్ పిచాయ్ నివసించిన ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసిన క్షణమే దాని కొనుగోలుకు మణికందన్‌ ముందుకు వచ్చినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఆ ఇంటిని కూల్చివేసి, స్థలానికి సంబంధించిన ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్‌ తండ్రి రఘునాథ పిచాయ్‌ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారని మణికందన్‌ వెల్లడించారు.

‘సుందర్ పిచాయ్ మన దేశాన్ని గర్వపడేలా చేశారు. ఆయన నివసించిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడం నా జీవితంలో గర్వించదగ్గ విజయం’ అని మణికందన్ పేర్కొన్నారు. స్థిరాస్తి కొనుగోలు లావాదేవీలు సాగుతోన్న వేళ సుందర్‌ తల్లిదండ్రుల మర్యాద తనను కదిలించిందని తెలిపారు. ‘సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారు. ఆయన తండ్రి మొదటి సమావేశంలోనే నాకు సంబంధిత పత్రాలు అందించారు. వారి వినయపూర్వక వ్యవహార శైలిని చూసి ఆశ్చర్యపోయా’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news