కర్ణాటకలో BRS లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలుపు అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీ ఆర్ ఎస్ మొదటి ఫలితం పై స్పందించారు జగదీష్ రెడ్డి. విజన్ ఉన్న నాయకుడిగా కేసీఆర్ కి పేరు.. కేసీఆర్ తెలంగాణా ఆకాంక్షలు నెరవేర్చిన విధం దేశ ప్రజలను ఆకర్షిస్తుందని వెల్లడించారు.
మహారాష్ట్రలో brs కి ఆదరణ వస్తుంది..మహారాష్ట్రలో బీ ఆర్ ఎస్ ప్రభంజనం మొదలైందన్నారు. తప్పకుండా ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కోనసాగుతుంది.. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశాల వ్యాప్తంగా ఇంకా బలోపేతమ అవుతామని స్పష్టం చేశారు. భారత దేశంలో బీ ఆర్ ఎస్ ప్రధాన పార్టీగా ఆవిర్భవిస్తుందని వెల్లడించారు జగదీష్ రెడ్డి. కర్ణాటకలో మేము లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలుపు అని.. ఎత్తుగడలో భాగంగానే కర్ణాటకలో పోటీ చేయలేదని పేర్కొన్నారు జగదీష్ రెడ్డి.
అటు 2 వేల నోట్ల రద్దు పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. 2 వేల నోట్ల రద్దు చర్య మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య అని.. దేశాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసే కుట్ర అని ఆగ్రహించారు. రద్దుతో దేశంలో పేదరికం ప్రబలే అవకాశం అని.. నోట్ల రద్దు ఎందుకు చేశాడో తెలీదు , ఎంత నల్ల ధనం వెలికితీశారో తెలీదని పేర్కొన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాకుండా కొంత మంది వ్యక్తుల కోసమేనని.. ప్రజలకు కాకుండా అజ్ఞాతంగా కొందరికి లబ్ది కోసమేనని చెప్పారు.