కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించనుందని తెలిపారు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. తాము 5 వాగ్దానాలు చేశామని.. వాటిని రెండు గంటల్లో అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటకలో విద్వేశంపై ప్రేమ గెలిచిందని అభివర్ణించారు రాహుల్ గాంధీ. ప్రజలు బిజెపి అవినీతిని సైతం తిప్పి కొట్టారని అన్నారు.
విద్వేశంపై ప్రేమతో గెలుపొంది ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని.. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ” మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వము. ఏది చెప్పామో అదే చేస్తాం. మరో ఒకటి, రెండు రోజుల్లోనే కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోని ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం” అన్నారు రాహుల్ గాంధీ.