కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…

-

కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ మొటిక్కాయలు వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లోని ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ లో చుక్కెదురైంది, స్వయంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు ఉండవని… ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ కు ధన్యవాధామాలు తెలిపింది. ఇది జరిగిన కొన్ని రోజుల అనంతరం ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అధికారుల బదిలీల కోసం ఆర్డినెన్సు ను సుప్రీమ్ కోర్ట్ లో వేసింది. ఈ ఆర్డినెన్సు పై కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై చురకలు అంటించారు.

ఈ ఆర్డినెన్సు అయిదు నిముషాల్లోనే కొట్టి వేస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ పనులను ఆపడానికి మరియు ఇంకొంచెం ఆలస్యం చేయడానికి మాత్రమే ఈ ఆర్డినెన్సు తీసుకువచ్చారు అంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news