“బిచ్చగాడు 2” మూవీ రిలీజ్ అయ్యేది ఆ ఓటిటి లోనే !

-

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు తన టాలెంట్ తో బాగా దగ్గరైన హీరో, దర్శకుడు మరియు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో థియేటర్ లలోకి వచ్చాడు. ఇంతకు ముందు ఇదే టీం తో వచ్చిన బిచ్చగాడు మూవీ అమ్మ సెంటిమెంట్ తో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందన్న బిచ్చగాడు 2 మూవీ రిలీజ్ అయినా రోజు నుండి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినప్పటికీ కలెక్షన్స్ లు నిలకడగా వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను ఓ టి టి లోకి రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

కాగా ఆ మూవీ యూనిట్ నుండి తెలుస్తున్న కన్ఫర్మేషన్ ప్రకారం డిస్నీ హాట్ స్టార్ లో జూన్ మూడవ వారం నుండి తమిళ్ మరియు తెలుగు భాషలలో ప్రసారం కానుంది. కాగా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 4 .24 కోట్ల రూపాయలు కలెక్షన్ లు సాధించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news