కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో నంబర్ వన్​గా తెలంగాణ

-

కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. డోస్‌-1, డోస్‌-2లలో రాష్ట్రం ముందంజలో ఉంది. 12-14 ఏళ్ల వయసువారికి మొదటి, రెండు డోస్‌లు, 15-17 వయసు వారి మొదటి, రెండు డోస్‌లలో 90 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ జరిగింది. కానీ ఈ కేటగిరీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర సగటు కంటే తక్కువ నమోదవ్వడం గమనార్హం. వీటన్నింటిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను రూపొందించింది.

దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో మొదటి డోస్‌ కోటి కంటే ఎక్కువమందికి వేయగా.. రాష్ట్రంలో 106 శాతంతో నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. నూరు శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా చివర్లో ఉంది. రెండో డోస్‌ 103 శాతంతో దేశంలో తెలంగాణ ద్వితీయస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, కుమురంభీం జిల్లాల్లో మాత్రం 94 శాతం మంది వేయించుకున్నారు.

గతనెల దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌లు రాకపోవడంతో తెలంగాణ సొంతంగా వ్యాక్సిన్‌లు సమకూర్చుకుంది. బూస్టర్‌ డోస్‌పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపలేదు.

Read more RELATED
Recommended to you

Latest news