పెళ్లిలో తల పై జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారో తెలుసా?.. అసలు రహస్యం ఇదే…

-

భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఒక ప్రత్యేకత ఉంది… అందుకే ప్రతిదానిని సంప్రదాయం ప్రకారం చేస్తారు.. కానీ ఇప్పుడు అలాంటి సంప్రదాయాలు ఈరోజుల్లో కనుమరుగయ్యాయానే చెప్పాలి.పెళ్లి చూపులు అయినప్పటికీ నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తున్నారు.కానీ పూర్వం రోజులలో వివాహానికి ముందు కలవడం, మాట్లాడుకోవడమే కాకుండా కనీసం చూసుకునే వారు కూడా కాదు..కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఆగరు.. పెళ్లి ఫిక్స్ అవ్వగానే ఇక వారికి పర్మిషన్ వచ్చినట్లు తెగ ఫీల్ అవుతారు..

అందుకే అడ్డుగా తెరా పట్టుకొని నిలబడతారు. ఇంతకీ జిలకర్ర బెల్లం ఎందుకు పెడతారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మండపంలోకి పెళ్లికూతురుని తీసుకువచ్చిన తర్వాత అప్పటికే పెళ్లి కుమారుడిని అక్కడ కూర్చోబెట్టి ఇద్దరి మధ్య తెర పట్టుకుని నిలబడతారు. ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వారి మధ్య ఉన్న తెరను తొలగిస్తారు. అప్పుడు ఇద్దరు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు.. అలా చూసుకోవడం వల్ల వాళ్ళ బంధం ఇంకా బలంగా ఉంటుందని నమ్మకం..

జిలకర్రను ఎందుకు పెడతారంటే త్వరగా ముసలితనం రాకుండా ఉండేందుకు.. అలాగే బెల్లం ను ఎందుకు పెడతారంటే వారి బంధం తియ్యగా, ఎవ్వరు విడదీయ్యాలేనంత గా ఉండాలని ఈ రెండింటిని వాడతారు.. ఈ రెండు కలిస్తే నిత్య యవ్వనమే అని అర్థం కూడా వస్తుంది. అంటే కలకాలం నిత్యయవ్వనవంతుల్లా ఉండాలని దీవించడం కూడాను.. అదండి అసలు మ్యాటర్..

Read more RELATED
Recommended to you

Latest news