తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ స్కూళ్లలో రాగిజావ ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ కూడా ముందుకు వచ్చింది. ఏపీ ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో రాగిజావ ఇస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివే 16.82 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రాగి జావ అందించనుంది కేసీఆర్ సర్కార్.
మధ్యాహ్న భోజనానికి అదనంగా ఏడాదిలో 110 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి పోషణ్ పథకం అమలుకు రాష్ట్రం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 27.16 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం రూ. 16.18 కోట్లు, రాష్ట్రం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. ఇక కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి పేరేంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.