BREAKING : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన నివాసం జప్తునకు అనుమతి కోరింది ఏపీ సీఐడీ. ఈ మేరకు విజయవాడ తాజాగా సీఐడీ కోర్టులో దరఖాస్తు చేశారు ఏపీ సీఐడీ అధికారులు.
ఉండవల్లి లో కరకట్టపై ఉంటున్న చంద్రబాబు నివాసం జప్తుకు ఉత్తర్వులు ఇవ్వాలని దరఖాస్తు చేశారు ఏపీ సీఐడీ అధికారులు. ఇక నేడు.. ఈ వివాదంపై విచారణ చేయనుంది ఏసీబీ కోర్టు. ఒక వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన నివాసం జప్తునకు కోర్టు అనుమతి ఇస్తే.. ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగి.. అన్నంత పని చేసేస్తారు.