సీఎం జగన్ దున్నపోతులాంటి పాలకుడు అంటూ తెలుగు దేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జనాన్ని తన్నే దున్నపోతులాంటి పాలకుడు జగన్ వల్లే కరెంటు కోతలు, లోఓల్టేజీ సమస్యలు అంటూ విమర్శించారు లోకేష్. యువగళం పాదయాత్ర 112వరోజు దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాంప్ సైటు నుంచి ఆరంభించారు లోకేష్.
అంతకుముందు చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం సలివెందుల, దేవగుడి క్రాస్, ప్రొద్దుటూరు నియోజకవర్గం చౌడూరు, శంకరాపురం, పెద్దశెట్టిపల్లి, నరసింహాపురం మీదుగా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకర్గంలోకి చౌడూరు వద్ద ప్రవేశించిన పాదయాత్రకి ఘనస్వాగతం పలికారు. వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, చేనేతలు, ఎంఆర్ పిఎస్ కార్యకర్తలు వారి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు లోకేష్.