ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు శుభవార్త…!

-

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్‌ న్యూస్ ని చెప్పింది. నేడు రైతుల అకౌంట్ల లో రూ.5,500 జమ చేయనుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. వైెెెఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకి జగన్ సర్కార్ డాబులని జమ చేయనుంది. ఈ డబ్బులతో పాటుగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ బహిరంగ సభ ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

farmers

అయితే ఈ సభ లో బటన్ నొక్కి రైతు భరోసా డబ్బులని విడుదల చేయనున్నారు. ప్రతి ఏడాది రైతులకు జగన్ ప్రభుత్వం రూ.13,500 ఆర్ధిక సాయం ని రైతు భరోసా తో ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఈ డబ్బులని ఇస్తోంది. ఏడాదికి మూడు దఫాలుగా ఈ డబ్బులని ఇస్తోంది తొలి విడత కింద రూ.7,500, రెండో విడత రూ.4 వేలు, మూడో విడత రూ.2 వేలు రైతులు ఖాతాల్లో పడతాయి. తొలి విడత పెట్టుబడి సాయం కిందన గురువారం 52,30,930 మంది రైతుల ఖాతాల్లో రూ.3,923.21 కోట్ల నగదును ప్రభుత్వం జమ చేయనుంది.

ప్రతి ఏడాది మే లో రూ.7,500 ని మొదటి విడత కింద అందిస్తోంది. ఇప్పుడు జూన్ 1న రూ.5,500 ఇస్తోంది. పీఎం కిసాన్ ఇచ్చాక మిగతా రూ.2 వేలు జమ చేయనుంది. రెండో విడత సాయం అక్టోబర్ నెలలో వస్తాయి. మూడో విడత నిధులు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఇస్తారు. నాలుగేళ్లలో రైతు భరోసా పథకం ద్వారా రూ. 30,985 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. పంట నష్టోయిన రైతులకు నాలుగేళ్లలో రూ.1,965 కోట్లు ఇచ్చింది. ఈ నాలుగేళ్లల్లో 22.74 లక్షల మంది రైతులు ఇన్‌ఫుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news